News

తమిళనాడులో ఉచిత వైఫై


తమిళనాడులో ఏభై ప్రాంతాలలో వైఫై స్కీమును ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి అమ్మ ఉచిత వైఫై జోన్ అని ప్రభుత్వం పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం పది కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తొలి దశలో ఏభై పాఠశాలలలో ఈ వైఫై స్కీమును అదుబాటులోకి తెస్తామని ప్రభుత్వం తెలిపింది.బస్ స్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, పార్కులు, స్కూళ్లలో ఈ ఉచిత వైఫై అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.గత ఎన్నికలలో ఈ మేరకు అన్నా డి.ఎమ్.కె. హామీ ఇచ్చింది. అమ్మ వాటర్‌, అమ్మ సిమెంట్‌, అమ్మ మెడిసిన్‌, అమ్మ క్యాంటీన్‌ వంటి స్కీములను ప్రభుత్వం అమలు చేస్తోంది.